Thursday, June 3, 2010

మహా పురుషులు మరణించారు,దుర్బలులు మరణించారు.దేవతాస్వరూపులు సైతం  మరణించారు. మృత్యువు- ఎక్కడ చూసినా అది ఉంది.అంతులేని గతానికి యీప్రపంచం శ్మశానభూమి.ఐనా మనం యీ దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం.“నేనెన్నడూ చనిపోవటంలేదు.“ ఈ దేహం నశించక తప్పదని స్పష్టంగా  తెలిసీ,దీన్ని పట్టుకొని పాకులాడుతున్నాం. ఇందులో అర్ధం లేకపోలేదు.ఒక అర్ధంలో మనం మరణించం.నిజంగా నాశనం లేనిది ఆత్మే.ఐనా మనం అంటిపెట్టుకొనుండేది యీ దేహాన్నే.అది మన తప్పు.
                                   

                               శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం-౨ పేజీ౧౮౦.

Wednesday, November 4, 2009


Then only will India awake when hundreds of large-hearted men and women, giving up all desires of enjoying the luxuries of life, will long and exert themselves to their utmost for the well-being of the millions of their fellow citizens who are gradually sinking lower and lower in the vortex of destitution and ignorance.

Letter to Sarala Ghoshal, Editor of Bharati. Written from Darjeeling
on April 6, 1897. Complete Works,5.127.
 
అన్ని కోర్కెలను విడిచిపెట్టి , విశాలహృదయులైన స్త్రీపురుషులు వందలమంది ముందుకొచ్చి,పేదరికం అజ్ఞానం అనే సుడిగుండం లో పడి నానాటికీ కుంగి కృశించి , అణగారి పోతున్న లక్షలాది స్వదేశస్తుల నిమిత్తం , వారి సంక్షేమం నిమిత్తం , అపరిమితమైన ఆకాంక్షతో ,తమ సర్వ శక్తిని ధారపోసి,కష్టించి పని చేస్తే మాత్రమే మన జాతి జాగృతం అవుతుంది.
శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం,10.109 

Tuesday, November 3, 2009


On the one hand there is the conservative society, like a mass of inert matter and, on the other, the restless, impatient, fire-darting reformer. The way to good lies between the two.
 Letter to Sarala Ghoshal, Editor of Bharati. Written from Darjeeling
on April 6, 1897. Complete Works,5.127.
నిర్జీవమైన మట్టిముద్దలా ఒకవంక ప్రాచీన సంప్రదాయాలను వదలరాదనే మొండిపట్టుదల గల సమాజం,మరొకవంక ఆందోళనలోనూ,ఆత్రం తోనూ , మండిపడుతున్న సంఘసంస్కర్త వున్నారు.శ్రేయోదాయకమైన మార్గం ఈ రెండిటికీ మధ్యస్తమైంది.
శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం,10.108.

Monday, November 2, 2009


Doing the duty of the time is the best way, and if it is done only as a duty, it does not make us attached.

Letter to an American lady. From London: December 13, 1896. Complete Works, 5.125.

కాలానికి అనుగుణమైన విధిని,సమయొచిత ధర్మాన్ని అనుసరించటం ఉత్తమమార్గం.‘ఇది నా ధర్మం,ఇది నా కర్తవ్యం‘ అనే దృష్టితో ఆచరిస్తే,అది నీకు బంధాన్నిగాని సంగాన్నిగానీ కల్పించదు.
లేవండి,మేల్కొనండి!,10.95.

Sunday, November 1, 2009



      
 లక్ష్మీకటాక్షానికి దూరమై, దురదృష్టపీడితులై,వివేచనాజ్ఞానం పూర్తిగా నశించిపోయి,అధఃపతితులై, ఆకలితో మలమల మాడుతూ, పరస్పరం కలహించుకుంటూ, అసూయాపరులై అలమటిస్తున్నఈదేశస్తులను(భారతీయులను)ఎవరైనా హృదయపూర్వకంగా ప్రేమించగలిగిన నాడు మన భారతదేశం తిరిగి జాగృతం కాగలదని నేనూ నమ్ముతున్నాను.
                                                                  _ శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం,10.108

Saturday, October 31, 2009



       శ్రీ రామకృష్ణుని మాటలు వినలేదా నీవు? ఈశ్వర కృప అనే గాలి ఎల్లప్పుడూ వీస్తూనే ఉంది.తెరచాప విప్పటమే నీవు చేయవలసిన పని.
                                               (స్వామి _శిష్య.సంభాషణలు పేజీ 14)
నాయనా! ఉన్న విషయమేమంటే, ఈ లోకమంతా నీచమైన కుతంత్రాలతోనిండిపొయింది. కాని, నైతిక బలం,వివేకం కలవాళ్ళు వీతివల్ల ఎప్పుడూ మోసపోరు.లోకం దాని యిష్టం వచ్చినట్లు మాట్లాడనీ, నేను ధర్మమార్గాన్నే అనుసరిస్తాను.ఇది ధీరుని విధానం అని తెలుసుకో! లేకపోతే, రాత్రింబవళ్ళు వీడేమి అన్నాడో, వాడేమి వ్రాశాడో అని చూస్తుంటే , ఈ లోకంలో ఏ మహత్కార్యం సాధ్యం కాదు.
                                                                     _స్వామి వివేకానంద
                                                      ( స్వామి శిష్య సంభాషణలు,పేజీ౧౧౦,౧౭_౨౨)